కలం, డెస్క్ : ఆసియాలోనే అతి పెద్ద ఆదివాసీ జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు (Medaram Jathara) రావాల్సిందిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ (KCR)ను మంత్రి సీతక్క (Seethakka) ఆహ్వానించారు. ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే ఈ జాతరకు ముఖ్యమంత్రి సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సైతం హాజరుకావాలని కోరుతూ ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి మంత్రి సీతక్క ఆహ్వానించారు. ఆమెతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ కూడా ఉన్నారు.
ఇప్పటికే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కూడా స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రాసద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తదితరులను కూడా కలిసి ఇన్విటేషన్ ఇచ్చి విజ్ఞప్తి చేశారు. పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్ర సీతక్క గురువారం మధ్యాహ్నం గాంధీభవన్ నుంచి బయలుదేరి నేరుగా ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి (ఫామ్ హౌజ్) వెళ్ళారు.

Read Also: నిజామాబాద్, సిరిసిల్లను వణికిస్తున్న చిరుత
Follow Us On: Sharechat


