కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల సరిహద్దు గ్రామాలను చిరుతపులి (Cheetah) వణికిస్తోంది. జిల్లాల సరిహద్దుల్లో ఉండే అటవీ గ్రామాలు, తండాల్లో చిరుత కదలికలు కనిపిస్తున్నాయి. సిరిసిల్ల రిజర్వు ఫారెస్టులోని తిరుపల్లి గుట్ట బీట్ పరిధిలో లేగదూడపై చిరుత (Cheetah) దాడి చేసి చంపేసింది. గోప్యాతండాకు చెందిన రైతు ఫిర్యాదుతో లేగదూడకు పోస్ట్ మార్టం నిర్వహించారు అధికారులు. నిజామాబాద్ జిల్లా సిరికొండ రేంజ్ ఎస్ఆర్వో రవీందర్ మాట్లాడుతూ.. నివేదిక ఉన్నతాధికారులకు పంపి బాధిత రైతుకు అటవీశాఖ నుంచి నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. అటవీ శాఖ సీసీ కెమెరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. నిజామాబాద్ జిల్లా సిరికొండ ఫారెస్ట్ పరిధిలోని పంది మడుగు, చీమన్ పల్లి, జినిగాలతో పాటు 10 గ్రామాల్లో ప్రజలు భయంతో పొలాలకు వెళ్తున్నారు.


