epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

లాజిస్టిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఏపీ క్యాబినెట్​ ఆమోదం

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ క్యాబినెట్​ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో లాజిస్టిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఎంఎస్‌ఎంఈ పరిధిలో ఏపీ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్​ కు క్యాబినెట్ ఆమోదించింది. దాదాపు రూ.200 కోట్ల 45 ఏర్పాటు చేయబోయే ఎంఎస్‌ఎంఈ కామన్‌ ఫెసిలిటీ కేంద్రాల ద్వారా వచ్చే ఐదేళ్లలో 500 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్​ ను తీసుకువచ్చింది.

అలాగే, రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్​ ఓకే చెప్పింది. బార్లలో అదనపు రీటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ ఉపసంహరణపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై చర్చించిన క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో జల్​ జీవన్​ ద్వారా నీటి సరఫరాకు రూ.5 వేల కోట్ల రుణం ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదించింది.

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల కిట్‌లు పంపిణీకి రూ. 944.53 కోట్ల పరిపాలన అనుమతులు ఇచ్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సంప్రదాయేతర ఇంధన, విద్యుత్‌ ప్రాజెక్టులు ఏర్పాటుకు కేబినెట్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. CRDA సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోందించిన Andhra Pradesh మంత్రివర్గం.. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు అనుమతించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>