కలం, సినిమా: ఈ సంక్రాంతి (Sankranti)కి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. ఈ నెల 9న రాజా సాబ్, 12న మన శంకరవరప్రసాద్ గారు, 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి, 14న అనగనగ ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి సినిమాలు విడుదలకు వస్తున్నాయి. వీటితో పాటు విజయ్ జననాయకుడు కూడా 9న వస్తోంది. వీటిలో క్రేజ్ పరంగా ఏ సినిమాలు ముందున్నాయి, ఏ సినిమాలు సర్ ప్రైజ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం.
సంక్రాంతికి స్టార్ డమ్, క్రేజ్ పరంగా చూస్తే.. ప్రభాస్ (Prabhas) నటించిన రాజా సాబ్, చిరంజీవి మన శంకరవరప్రసాద్ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. ప్రభాస్, చిరంజీవి ఇద్దరూ ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్స్ కు భారీ సంఖ్యలో రప్పించగలరు. మన శంకరవరప్రసాద్ క్రేజ్ కు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తోడయ్యారు. రాజా సాబ్‌కు ఆ జానర్, ప్రభాస్ క్రేజ్ అడ్వాంటేజ్. చిరంజీవి సినిమాలో గత సంక్రాంతికి హిట్ కొట్టిన వెంకీ కూడా ఉండటం కలిసొచ్చే విషయం. ఈ సినిమాల ఫలితం ఎలా ఉన్నా సంక్రాంతి (Sankranti) హాలీడేస్ లో రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు సినిమాల ఓపెనింగ్స్‌కు ఢోకా ఉండదు. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు ఓపెనింగ్స్ లో రికార్డ్ లు క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాయి.
ఇక సంక్రాంతికి రవితేజ (Ravi Teja) భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు వస్తున్నాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి ఇటీవల పాటలతో క్రేజ్ తెచ్చుకుంటోంది. నారీ నారీ నడుమ మురారీ టీజర్ తో ట్రేడ్ వర్గాలను ఆకర్షించింది. నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు సినిమా కంటెంట్ బాగుందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. ఈ మూడు చిత్రాల్లో ఏది సర్ ప్రైజ్ హిట్ కొట్టినా కొట్టొచ్చు అనే టాక్ వినిపిస్తోంది. రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ టాక్‌తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ రాబడితే, మిగతా చిత్రాల్లో కంటెంట్ బాగున్నవి లాంగ్ రన్ కు వెళ్లే ఛాన్స్ ఉంది. మరి.. ఏం జరగనుందో చూడాలి.
Read Also: ‘మిస్టర్ టారిఫ్’ మహారాజ్: ఒక్క టారిఫ్‌తో వెనిజువెలా జేబులోకి, గ్రీన్‌ల్యాండ్ బ్యాగ్‌లోకి!
Follow Us On : WhatsApp


