epaper
Friday, January 16, 2026
spot_img
epaper

‘ది రాజాసాబ్’ కి AP సర్కార్ భారీ బూస్ట్ : ప్రభాస్ సినిమాకి 10 రోజుల పాటు హైక్!

కలం, వెబ్​ డెస్క్​ : మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ (Raja Saab) సినిమా పోస్టర్లు, గ్లింప్స్​, సాంగ్స్​ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ప్రభాస్​ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టికెట్​ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాజాసాబ్ సినిమా జనవరి 9న రిలీజ్ కానుండగా ముందు రోజే ప్రీమియర్స్​ వేస్తున్నారు.

8వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 12 వరకు ప్రీమియర్​ షోలకు అనుమతి వచ్చింది. ప్రీమియర్​ కు ఏకంగా రూ.1000 ధర పెట్టుకోవచ్చని ఏపీ ప్రభుత్వం అనుమతించింది. 9వ తేదీ నుంచి పదిరోజుల పాటు సింగిల్ స్క్రీన్స్​ లో రూ.150, మల్టీప్లేక్స్​ లో రూ.200 పెంచుకునేలా పర్మీషన్​ ఇచ్చారు. అలాగే, మొదటి పది రోజులపాటు రోజుకు 5 షోలు వేసుకోవచ్చని జీవోలో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

Raja Saab
Raja Saab

Read Also: యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్​లో రాజాసాబ్ జోరు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>