జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బీఆర్ఎస్ బలంగా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్(KCR).. నేతలకు దిశానిర్దేశం చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు లక్ష్యంగా, పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన, ఎర్రవెల్లి నివాస ప్రాంగణంలో మరికాసేపట్లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం నియోజకవర్గంలోని పరిస్థితులు, పార్టీలో చేరికలు, ప్రచారశైలి సహా పలు కీలక అంశాలను చర్చించినట్లు సమాచారం. అదే విధంగా పార్టీ నేతలకు కేసీఆర్ పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
Read Also: ఐఏఎస్లకు కేటీఆర్ రిక్వెస్ట్..

