కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ నేతలు తిన్న అవినీతి సొమ్ము కక్కిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో గురువారం పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. ఢిల్లీ నేతలు రాగానే రేవంత్ రెడ్డి (Revanth Reddy) గజగజ వణుకుతాడని సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఆత్మగౌరవం, స్వయంపాలన కోసం కొట్లాడిన తెలంగాణలో ఢిల్లీ పార్టీల గులాములు ఉండటం బాధాకరమని పేర్కొన్నారు.
పాలన కానే కాదు.. అవినీతి పాలన..
సొంత పార్టీ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వ బాగోతాలు బట్టబయలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో 20శాతం పర్సెంట్ కమిషన్ లేనిది పని కావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యలే చెబుతున్నారని అన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి (MLA Anirudh Reddy) మాట్లాడుతూ పర్సెటేంజ్ లేనిది పనికావడం లేదని అన్నాడని, కాకపోతే కాంగ్రెస్ నేతలపై కాకుండా అధికారులు దోచుకుంటున్నారని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. ఇది ప్రజా పాలన కానే కాదని.. అవినీతి పాలన అంటూ దుయ్యబట్టారు.
రూ.5 లక్షల కోట్లు దోచుకున్న రేవంత్ రెడ్డి..
రేవంత్ సర్కార్ అవినీతి, కుంభకోణాల సర్కార్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారని కేటీఆర్ (KTR) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని ప్రపంచ బ్యాంకుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అర్జీలు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి.. రూ.5 లక్షల కోట్లు దోచుకున్న పచ్చి దొంగ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) అన్నాడని తెలిపారు. రేవంత్ సర్కార్ అన్ని వర్గాలను మోసం చేసిందని దుయ్యబట్టారు. తెలంగాణకురావాల్సిన నీళ్ల వాటాను.. ఆంధ్రాకు తరలిస్తూ రాష్ట్ర రైతులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎవరిని వదలిపెట్టం..
సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టు టెండర్లులో కుంబకోణాలు, అవినీతి చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వపు అన్ని కుంబకోణాలు, అవినీతి బయటకు వస్తాయన్నారు. తాను దోచుకున్న సోమ్ముతో ఒటుకు రూ.15 వేలిచ్చి కోనుగోలు చేస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడని.. డబ్బులు పంచితే తనకే ఒటు వేస్తారనే భ్రమలో రేవంత్ ఉన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏడాది తర్వాత వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని.. ఎగిరేది గులాబీ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరిని వదలిపెట్టబోమని హెచ్చరించారు.
Also Read : అంబానీల నుంచి పెళ్లి ప్రపోజల్ వచ్చింది: అనన్యా బిర్లా
Follow Us On : WhatsApp

