అంబానీల‌ నుంచి పెళ్లి ప్ర‌పోజ‌ల్ వ‌చ్చింది: అన‌న్యా బిర్లా

క‌లం, సినిమా: ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమార్తె, సింగర్ అనన్యా బిర్లా (Ananya Birla) ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారారు. అంబానీ ఫ్యామిలీ గురించి ఆమె చేసిన వ్యాఖ్య‌లే దీనికి ప్ర‌ధాన కార‌ణం. తాజాగా అన‌న్యా బిర్లా బాలీవుడ్ డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్ షో కాఫీ విత్ క‌ర‌ణ్‌కు హాజ‌ర‌య్యారు. ఆమెతో పాటు బాలీవుడ్ న‌టి అన‌న్యా పాండే కూడా షోలో ఉన్నారు. ఈ షోలో అనన్యా బిర్లా చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. అనంత్ అంబానీతో పెళ్లి సంబంధం కోసం అంబానీ ఫ్యామిలీ (Ambani Family) తమ ఫ్యామిలీని సంప్రదించిందని అన‌న్యా తెలిపింది.

అయితే ఈ ప్ర‌పోజ‌ల్‌ను మొదట రిజెక్ట్ చేసిన‌ట్లు చెప్పింది. త‌ర్వాత‌ మూడు నెలలకు మరోసారి పెళ్లి ప్ర‌పోజ‌ల్‌ తీసుకొచ్చారని పేర్కొంది. అయితే అనంత్‌తో త‌న‌కు పెళ్లి ఆలోచ‌న లేక‌పోవ‌డంతో ఆ సంబంధాన్ని అంగీకరించలేదని అనన్యా చెప్పినట్లుగా సోష‌ల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అనన్యా (Ananya Birla) రిజెక్ట్ చేసిన త‌ర్వాత ఈ పెళ్లి ప్ర‌పోజ‌ల్ రాధికా మర్చంట్ కుటుంబానికి వెళ్లిందనే చ‌ర్చ న‌డుస్తోంది.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల పెళ్లి అప్పట్లో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. వీరిద్దరిదీ ల‌వ్ మ్యారేజ్ అని, టీనేజ్ నుంచే ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో అన‌న్యా పేరుతో జ‌రుగుతున్న ప్ర‌చారం అనుమానాల‌కు తావిస్తోంది. మ‌రోవైపు రాధికకు గతంలో కాలేజీ రోజుల్లో ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, అతనితో నాలుగేళ్ల పాటు రిలేష‌న్‌షిప్‌లో ఉందని కూడా సోష‌ల్ మీడియాలో కొన్ని ఫోటోలు ప్ర‌చారం అవుతున్నాయి. ఈ రెండు విష‌యాల‌పై అధికారికంగా ఎలాంటి స్ప‌ష్ట‌త లేకున్నా నెటిజ‌న్లు మాత్రం ఈ పుకార్ల‌ను తెగ వైర‌ల్ చేస్తున్నారు.

Also Read : నా లక్ష్యం అదొక్కటే.. లోకేష్ ఆసక్తికర పోస్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>