కలం, వరంగల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (MLA Naini Rajender Reddy) మండిపడ్డారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి నీది కాదని, సీఎం రేవంత్ రెడ్డి సహనం పాటిస్తున్నారని, లేదంటే రోడ్లమీద తిరగలేరని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఎక్కడున్నాడో చెప్పాలని నాయిని ప్రశ్నించారు. అధికారం అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకున్న చరిత్ర మీదని, బూతులు మాట్లాడాలంటే మాకు సంస్కారం అడ్డొస్తోందన్నారు. మేం తలుచుకుంటే నీకంటే ఎక్కువే తిట్టగలమని, మరోసారి వరంగల్ వస్తే కేటీఆర్ (KTR)ను చెప్పులతో కొట్టిస్తానని నాయిని రాజేందర్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: ఈ నెల 18న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి: సీతక్క
Follow Us On: X(Twitter)


