ప్రభుత్వ హామీ.. సమ్మె విరమించిన ఎన్‌హెచ్ఎం ఉద్యోగులు

కలం, నాగర్ కర్నూల్: నేషనల్ హెల్త్ మిషన్ కింద పని చేస్తున్న ఉద్యోగులు (NHM Employees) 32 రోజుల పాటు సమ్మె నిర్వహించి ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చిన దరిమిలా శనివారం నుండి తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ఎన్ హెచ్ ఎం జేఏసీ నేతలు తెలిపారు. మూడు నెలల గడువుతో సమ్మెను తాత్కాలికంగా విరమించిన విరమిస్తున్నట్లు వారు తెలిపారు. శనివారం నుండే తిరిగి విధుల్లో చేరినట్లు నాగర్‌కర్నూల్ జిల్లా ఎంహెచ్ఎం ఉద్యోగులు తెలిపారు. 100 శాతం గ్రాస్ శాలరీ అమలుపై ప్రభుత్వ హామీ, ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఉద్యోగ భద్రతకు కృషి చేయాలని డిమాండ్ల‌పై సానుకూలంగా ప్రభుత్వం స్పందించినట్లు ఎన్ హెచ్ ఎం జేఏసీ నాయకులు బాలకృష్ణ, కుమార్ శ్రీనివాసులు తెలిపారు.

బీమా, హెల్త్ కార్డులపై హామీలు

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ విధానంలోకి మార్చే అంశంపై సానుకూల హామీ ప్రభుత్వం వైపు నుండి వచ్చినట్లు బాల‌కృష్ణ‌ తెలిపారు. మూడు నెలల్లో ప్రభుత్వ హామీలు అమలవుతాయని ఎంహెచ్ఎం జేఏసీ ఆశాభావం వ్యక్తం చేసింది.హామీల అమలును నిరంతరం రాష్ట్ర ఎన్ హెచ్ ఎం జేఏసీ నేతలు పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. హామీలు అమలు కాకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 17,500 మంది ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల పోరాటానికి అండగా ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల ఐక్యత, పట్టుదలతోనే ఈ ఫలితం సాధ్యమైందని, ప్రజలకు వైద్య సేవల్లో అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో సమ్మె విరమణ ప్రకటన చేసామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>