డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. సారంగాపూర్ లో మూడు కేసులు నమోదు

కలం, సారంగాపూర్ : మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్ (Sarangapur Police) హెచ్చరించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శనివారం సారంగాపూర్ మండలం మలక్ చించోలి ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు శనివారం సాయంత్రం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురిని గుర్తించి వారిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. సరైన వాహన ధ్రువపత్రాలు లేని వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>