కలం, వెబ్డెస్క్: అయ్యప్ప భక్తులకు శుభవార్త. ఇకపై భక్తులు స్వయంగా రచించి స్వరపరిచిన, పాడిన భక్తిగీతాలను శబరిమల (Sabarimala) దేవస్థానం సన్నిధిలో వినిపించే అవకాశం కలగనుంది. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(TDB) కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో భక్తులు రూపొందించిన కొత్త అయ్యప్ప భక్తి గీతాలను శబరిమల ఆలయంలోని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్లే చేసే పాటల జాబితాలో చేర్చనున్నారు. ప్రస్తుతం హరిహరసుతుని సన్నిధిలో కె.జె.ఏసుదాస్, జయవిజయ వంటి ప్రసిద్ధ గాయకులు ఆలపించిన భక్తి గీతాలనే వినిపిస్తున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. బోర్డు ప్రస్తుత నిర్ణయంతో, స్వామి భక్తులు తమ భక్తిని స్వరాల రూపంలో వ్యక్తపరిచే అరుదైన అవకాశం పొందనున్నారు. ఇది తమ భక్తి భావాన్ని స్వామి ముందు వ్యక్తపరిచేందుకు కలిగిన అదృష్టంగా భక్తులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: ఆధార్ వినియోగదారులకు షాక్..
Follow Us On: X(Twitter)


