కలం, వెబ్ డెస్క్ : రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు సినిమా నిర్మాతలు తెలంగాణ హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వాలని అప్పీలు దాఖలు చేశారు. టికెట్ రేట్లు పెంచకుండా సింగిల్ జడ్జి ఉత్తర్వులను వారు సవాల్ చేశారు. సింగిల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేయాలని నిర్మాతలు అప్పీలులో విజ్ఞప్తి చేశారు. టికెట్ ధరలపెంపు, ప్రత్యేక షోల కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు ప్రొడ్యూసర్లు వెల్లడించారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ సెక్రటరీకి సూచించాలని కోరారు. ఈ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు రేపు (బుధవారం) విచారణ చేపట్టనుంది.
Read Also: అసెంబ్లీ సెషన్ నిరవధిక వాయిదా
Follow Us On : WhatsApp


