ఎకరా భూమి రూ.100కే ఇస్తారా?: జగన్

కలం, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని, అందులో అయిదింటిని ప్రారంభించామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) తెలిపారు. మరో 9 కాలేజీలకు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు పెడితే పూర్తవుతాయని, కానీ చంద్రబాబు ప్రభుత్వం అలా చేయడం లేదని మండిపడ్డారు. పీపీపీ పేరిట ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే నిర్మాణంలో ఉన్న కాలేజీల భూములను కేవలం ఎకరా రూ.100కే లీజ్‌కు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఒక్కో ఎకరా విలువ రూ.వందల కోట్లు ఉంటుందన్నారు. ఏకంగా రూ.1,630 కోట్ల ప్రజాధనం దోపిడీ చేసేందుకు స్కెచ్ వేశారని ఆరోపించారు. సగానికిపైగా మెడికల్ సీట్లను అమ్ముకోవాలనేది అసలైన పన్నాగం అన్నారు.

అన్నీ ప్రభుత్వానివే.. ప్రైవేట్ ఎందుకు?

కాలేజీల్లో పనిచేసే డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వమే నెలకు రూ.5 కోట్ల చొప్పున రెండేళ్లకు కలిపి రూ.120 కోట్లు చెల్లిస్తుందని జగన్ పేర్కొన్నారు. అలాంటప్పుడు ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. భూములు, సిబ్బంది వేతనాలు ప్రభుత్వానివైతే.. ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనడం స్కాం కాకపోతే మరేంటన్నారు.

వైసీపీ (YS Jagan) ప్రభుత్వం తీసుకొచ్చిన కాలేజీలు టీచింగ్ ఆసుపత్రులతో పాటు స్పెషాలిటీ వైద్యం అందించే సామర్థ్యం ఉన్నాయని జగన్ తెలిపారు. దీంతో ఇక్కడ సీట్లన్నీ కన్వీనర్ కోటాలోనే భర్తీ అవుతాయని, మిగిలిన సగం సీట్లు కూడా ప్రైవేటుతో పోలిస్తే తక్కువ ఫీజుకే అందుబాటులోకి వస్తాయన్నారు. అలా వచ్చే డబ్బుతో కాలేజీ నిర్వహణ కూడా సులభమవుతుందన్నారు. ఇన్ని ప్రయోజనాలున్న కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం ఎందుకుని జగన్ ప్రశ్నించారు.

Also Read : గ్రాండ్‌గా అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>