ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా(Neeraj Chopra)ను భారత ప్రభుత్వం లెఫ్టినెంట్ కల్నల్(Lieutenant Colonel) హోదాతో గౌరవించింది. ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో నీరజ్ కనబరిచిన అద్భుత ప్రదర్శనకు బహుమతిగా ఆయనకు ఈ గౌరవాన్ని అందించింది. జావెలిన్ త్రోలో నీరజ్ వరుసగా రెండు పతకాలు సాధించాడు. ఈ నేపథ్యంలోనే నీరజ్‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. ఈ హోదాను ప్రదానం చేశారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి నీరజ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగానే రాజ్‌నాథ్.. నీరజ్‌పై ప్రశంసలు కురిపించారు. అతని విజయాలు అసాధారణమైనవని, దేశానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్(Neeraj Chopra) గోల్డ్ మెడల్ సాధించాడు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో రజతం కైవసం చేసుకున్నాడు. అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్వర్ణం, ఒక రజతం అందించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2016లో ఆర్మీలో సుబేదార్‌గా నీరజ్ చేరాడు. 2021లో సుబేదార్ నుంచి మేజర్‌గా పదవోన్నతి పొందారు. 2022లో ‘పరమ విశిష్ట సేవా’ పతకంతో కేంద్ర ప్రభుత్వం అతన్ని సత్కరించింది. ఇప్పుడు లెఫ్టినెంట్ కల్నల్ హోదాను కల్పించింది.
Read Also: ఏసీబీ దెబ్బ.. మూతబడిన చెక్‌పోస్ట్‌లు..!

