కూనారం వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఇంజన్!

కలం, పెద్దపల్లి: పెద్దపల్లి (Peddapalli) జిల్లా కూనారం (Koonaram) రైల్వే గేట్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కూనారం వద్ద ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంజన్ పట్టాలు తప్పడంతో స్థానికంగా కలకలం రేగింది.

సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. సాంకేతిక లోపమా లేక ట్రాక్ సమస్యా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. ట్రాక్ పునరుద్ధరణ పనులను అధికారులు చేపట్టారు. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Also Read : మోదీ, అమిత్ షా మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకోరు: సీఎం రేవంత్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>