ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచే రాష్ట్రంలో 10+2 విధానం అమల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యా శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యా విధానం మార్చాలని సూచించారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు.

9 నుంచి 12వ తరగతి వరకు స్పెషలైజ్డ్ విద్య అమలు జరిగేలా చూడాలని సీఎం రేవంత్ ఆదేశించారు. 12వ తరగతి దాటిన తరువాత పూర్తిగా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించడమే లక్ష్యంగా ఉండాలన్నారు. ఒక్క విద్యార్థికి కూడా నష్టం జరగొద్దని ఆదేశించారు. ఇప్పటికే యంగ్ ఇండియా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణం వేగవంతం చేశామన్నారు. దేశంలోనే ఉత్తమ విద్యా విధానాలు తెలంగాణలో ఉండేలా విద్యా శాఖ చర్యలు చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>