బోనకల్ కాలేజీలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

కలం, బోనకల్: ఖమ్మం జిల్లా బోనకల్ (Bonakal)లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, గొప్ప విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ లిగంనేని నళిని శ్రీ అధ్యక్షతన కళలశాల సిబ్బంది అంత మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

కళాశాల ప్రిన్సిపాల్ నళిని శ్రీ మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ విద్యా రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయులని కొనియాడారు. స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా దేశ విద్యావ్యవస్థ పటిష్టతకు పునాదులు వేశారని తెలిపారు. విద్య అనేది కేవలం ఉద్యోగ సాధనకే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, సమాజ అభివృద్ధికి, దేశ పురోగతికి దోహదపడే శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో లైబ్రరీయన్ ఎ.మోహన్, అధ్యాపకులు జోనతాన్ బాబు, లక్ష్మీకాంతం , పద్మావతి, రామకృష్ణ, రమేష్, రాజేంద్ర, ప్రియ కుమార్ రెడ్డి, మురళీకృష్ణ, యశోద, శాంతి ప్రియ, మదర్ సాహెబ్, జశ్వంత్, బుజ్జమ్మ, అరుణ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>