నిర్మల్‌లో ఆజాద్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం జాతీయ విద్యా దినోత్సవ (National Education Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన విద్యారంగానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు నల్ల వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం (Food Donation Programme) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>