epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బాయ్‌కాట్ చేసినా సభలోనే ఆ పదిమంది.. లాబీలో ఆసక్తికర చర్చ

కలం డెస్క్ : అసెంబ్లీ స్పీకర్ తీరుకు నిరసనగా ఈ సెషన్ మొత్తాన్ని బీఆర్ఎస్ (BRS) బహిష్కరించినా ఆ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలు హౌజ్‌లోనే ఉండిపోయారు. ఎవరా పదిమంది అనే అనుమానం కలగడం సహజం. కానీ అది ముమ్మాటికీ నిజం. ఆ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలు ప్రతీ రోజు సభకు హాజరవుతూనే ఉన్నారు. ఈ విషయమే అసెంబ్లీ లాబీల్లో బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చర్చనీయాంశమైంది. ఒకవైపు సెషన్ మొత్తాన్ని బహిష్కరించినట్లు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్పష్టమైన ప్రకటన చేసినా ఆ పదిమంది ఎందుకు హాజరవుతున్నారనే గుసగులు వినిపించాయి. సరిగ్గా ఇదే అంశం గురించి బీజేపీ ఎమ్మెల్యేల రాకేష్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మధ్య లాబీల్లో ఆసక్తికర చర్చ చోటుచేసుకున్నది.

టెక్నికల్‌గా ఆ పది మంది బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలే :

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం లాబీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తారసపడ్డారు. వారిద్దరి మధ్య సరదాగా జరిగిన సంభాషణ..

రాకేశ్‌రెడ్డి : నేను హోం మంత్రిని అవుతాను.. తెలంగాణకు సీఎం బీసీ వ్యక్తే అవుతారు.
దానం : అయితే అమిత్ షా ను తొలగిస్తారన్నమాట.
రాకేశ్‌రెడ్డి : ఈ సెషన్ మొత్తాన్ని బీఆర్ఎస్ బాయ్‌కాట్ చేసింది. కానీ ఇదే సభలో ఆ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు రోజూ ఉంటూనే ఉన్నారు. (పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో దానం కూడా ఒకరిగా ఉండడంతో ఆ అంశాన్ని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్)
దానం : నేను యుద్ధానికి ఎప్పుడైనా సిద్ధం (రిజైన్ చేసి ఉప ఎన్నికలో మళ్ళీ పోటీ చేయడానికి).
పీసీసీ చీఫ్ : ఆ పది మంది ఎమ్మెల్యేలు టెక్నికల్‌గా బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. (సంభాషణల సమయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎంటర్ అయ్యారు)

Read Also: హైకోర్టులో రకుల్​ప్రీత్​ సింగ్​ సోదరుడి పిటిషన్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>