epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

విజయ్​కి సీబీఐ నోటీసులు

కలం, వెబ్​డెస్క్​: సినీ నటుడు, టీవీకే అధిపతి విజయ్ (TVK Chief Vijay) ​కి సీబీఐ నోటీసులు జారీ చేసింది. కరూర్​ తొక్కిలాస ఘటనలో విచారణకు హాజరు కావాల్సిందిగా కోరింది. ఈ మేరకు జనవరి 12న విజయ్​ను సీబీఐ ప్రధాన కార్యాలయంలో అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీకి చెందిన పలువురు నాయకులను సీబీఐ ప్రశ్నించింది. కరూర్​ దుర్ఘటనకు సంబంధించి వివరాలు సేకరించింది. త్వరలో ఈ కేసుపై ఛార్జిషీట్​ వేయనుండడంతో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్​ను కూడా ప్రశ్నించాలని నిర్ణయించింది.

ఈ మేరకు నోటీసులు పంపింది. కాగా, నిరుడు సెప్టెంబర్​ 27న తమిళనాడులోని కరూర్​లో విజయ్​ బహిరంగ సభ, ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. వంద మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరుపుతోంది. మరోవైపు కరూర్ దుర్ఘటన అనంతరం విజయ్​ బహిరంగ సభలకు, ర్యాలీలకు తమిళనాడు ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తోంది.

TVK Chief Vijay
TVK Chief Vijay

Read Also: సిడ్నీలో స్మిత్​ రికార్డుల మోత

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>