సరోజ్ కుమార్ న్యూ మూవీ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ రిలీజ్‌

క‌లం, సినిమా: మాంగళ్యం, పరాక్రమం, నిర్భంధం వంటి మూవీస్‌తో తనలోని యాక్ట‌ర్‌ని అందరికీ పరిచయం చేసుకున్నాడు బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar). ఆయన నటన, మేకింగ్, టేకింగ్ అంటే ఓ వర్గానికి చెందిన ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా యూత్ అయితే ఆయ‌న యాక్టింగ్‌, డైలాగ్స్‌కు ఫిదా అయిపోతారు. ప్రస్తుతం సరోజ్ మరో వినూత్న కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. సరోజ్ ప్రధాన పాత్రల్లో రానున్న నూతన చిత్రం ‘ఛప్రి’ (Chapri). ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతల్ని సరోజ్ నిర్వర్తించారు. బీఎస్‌కే మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ మీద సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మించిన ఈ సినిమాలో సరోజ్‌తో పాటుగా ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీన్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

స్లమ్‌లో ఉండే ఓ కుర్రాడు.. అతడి ప్రేమ ప్రయాణం.. ఆ జర్నీలో కొంత మంది డబ్బున్న వ్యక్తులు ఎదురు పడటం, వారి వల్ల అతని జీవితం తలకిందులు అవ్వడం అనే ఆసక్తికరమైన పాయింట్స్‌తో ‘ఛప్రి’ మూవీని తెరకెక్కించారు. ప్రేమ చుట్టూ తిరిగే ఈ కథలో చివరకు ఏం జరుగుతుంది? అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అతని ప్రేమలో విజయం సాధిస్తాడా? లేదా? అన్నది ‘ఛప్రి’ మూల కథ. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని తాజాగా విడుదల చేశారు. ‘ఛప్రి’ ఫస్ట్ లుక్‌లో సరోజ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. స్లమ్ కుర్రాడిలా రా అండ్ రస్టిక్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ని గమనిస్తుంటే ఫుల్ యాక్షన్ మోడ్‌లో హీరో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>