ప్రేమించి పెద్దలను ఒప్పించి ఒక్కటైన జంట. పెళ్లయిన నెలకే దంపతులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన జగిత్యాల(Jagtial) జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో చోటు చేసుకుంది. అల్లెపు సంతోష్, తన ఇంటి దగ్గరే ఉండే గంగోత్రి.. నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి సెప్టెంబర్ 26న ఏడుడగుల బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయిన వారం రోజులకే కూర విషయంలో గొడవ అయింది. మటన్ కూరలో కారం ఎక్కువ అవడంతో భర్త మందలించడంతో గంగోత్రి మనస్థాపానికి లోనైంది. అక్టోబర్ 2న దసరా పండగ వేళ ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి సంతోష్ తీవ్ర మనోవేదనతో ఉంటున్నాడు. ఇక అక్కడ ఉండలేనని అనుకున్న సంతోష్.. ఆదిలాబాద్‌లోని తన అక్క ఇంటికి వెళ్లాడు.
Jagtial | తాను ప్రేమించిన గంగోత్రి ఇకలేదన్న మనోవేదన రోజురోజుకు అధికం అవుతుండటంతో మంగళవారం దీపావళి పండగ రోజున సంతోష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకున్నాడు. పెళ్లయిన నెల రోజుల్లోనూ భార్యభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Read Also: రౌడీ వేధింపులకు వివాహిత బలి..

