లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి: కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్: విద్యార్థులు చిన్నతనం నుంచే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణతో చదువుతూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) సూచించారు. గురువారం మావల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ‘ఇన్‌స్పైర్ అండ్ ఇగ్నైట్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు, చేస్తున్న త్యాగాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. మనసులోని భయాలను వీడి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఏ రంగంలోనైనా విజయాలు సాధించవచ్చని తెలిపారు. జీవితంలో లక్ష్య నిర్దేశం, మానవతా విలువలు, వేదికపై మాట్లాడే భయాన్ని అధిగమించడం, సానుకూల ఆలోచనా విధానం, జ్ఞాపకశక్తిని పెంపొందించే మెమరీ టెక్నిక్స్ తదితర అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

ఇలాంటి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని తమలోని ప్రతిభను వెలికితీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి మాధవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సాధన, కేజీబీవీ ప్రత్యేకాధికారి సువర్ణ, సెక్టోరల్ అధికారి సరిత, ఇన్‌స్పైర్ అండ్ ఇగ్నైట్ ఫౌండేషన్ డైరెక్టర్లు రంజిత్, రాము, సుధాకర్, వైద్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>