కోహ్లీ 100 సెంచరీల రికార్డు సాధ్యమేనా?

కలం, స్పోర్ట్స్ : భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన అద్భుతమైన ఆటతీరుతో మరోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 38వ పుట్టినరోజుకు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 51 బంతుల్లో 74 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు. ఇప్పటికే వన్డే, టీ20 ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న కోహ్లీ.. ఐపీఎల్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ట్రోఫీ విజేతగా నిలిచాడు. చాలామంది ఈ వయసులో ఆట నుంచి తప్పుకుంటున్నా.. కోహ్లీ మాత్రం మైదానంలో తన పాత జోరును కొనసాగిస్తున్నాడు.

ప్రస్తుతం కోహ్లీ కేవలం వన్డే క్రికెట్‌పైనే దృష్టి పెట్టాడు. 2025లో టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికినప్పటికీ.. వన్డేల్లో మాత్రం తన బ్యాట్‌తో పరుగుల వరద పారిస్తున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆడిన 16 వన్డే మ్యాచ్‌ల్లోనే నాలుగు అండర్ సెంచరీలు సాధించి తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఫిట్‌నెస్ విషయంలోనూ యువ ఆటగాళ్లకు గట్టి పోటీ ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో మొత్తం 86 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 100 సెంచరీల రికార్డును అందుకోవడానికి అతనికి ఇంకా 14 శతకాలు కావాలి. వన్డేల్లో కోహ్లీ ప్రదర్శిస్తున్న నిలకడైన ఫామ్‌ను చూస్తుంటే ఈ మైలురాయిని చేరుకోవడం అసాధ్యమేమీ కాదని అభిమానులు ఆశిస్తున్నారు.

2027 వన్డే ప్రపంచకప్‌లోపు భారత్ మరో 30 నుంచి 35 వన్డే మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఇందులో న్యూజిలాండ్, శ్రీలంక, జింబాబ్వే సిరీస్‌లతో పాటు ఆసియా కప్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఈ తక్కువ మ్యాచ్‌ల్లోనే 14 సెంచరీలు సాధించాలంటే ప్రతి రెండున్నర మ్యాచ్‌లకు ఒక శతకం బాదాల్సి ఉంటుంది. కఠినమైన ఈ లక్ష్యాన్ని కోహ్లీ తన అంకితభావంతో అధిగమిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>