నకిరేకల్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన రెండు ప్రమాదాలు

కలం, నకిరేకల్: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం (MLA Vemula Veeresham) కు గురువారం ఒకే రోజు రెండు ప్రమాదాలు తప్పాయి. రెండు ఘటనల్లోనూ ఆయన ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడటంతో నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

మొదటిది కట్టంగూరు మండలం చెరువు అన్నారం వద్ద చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం దెబ్బతిన్నప్పటికీ.. ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడ్డారు.

అనంతరం చిట్యాల మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. మరో కారులో భువనగిరి బయలుదేరారు. ఈ క్రమంలో దారి మధ్యలో ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి మరోసారి ప్రమాదం ఎదురైంది. అయితే ఈ ఘటనలోనూ ఆయన సురక్షితంగా బయటపడ్డారు. వరుస ప్రమాదాలు జరిగినప్పటికీ వేముల వీరేశం తన పర్యటనను ఆపకుండా.. అక్కడి నుంచి షెడ్యూల్ ప్రకారం జనగామ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం ఎమ్మెల్యే క్షేమంగా ఉన్నారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>