కలం, కరీంనగర్: ఒకప్పుడు తన కడుపులో పెట్టుకొని పెంచిన కొడుకు మరణించాడు.. ఇద్దరు బిడ్డలు ఉన్నప్పటికీ చివరి దశలో ఆ తల్లికి అండగా నిలబడాల్సిన వారు పట్టించుకోకపోవడంతో అనాధగా మిగిలిపోయింది. ఈ హృదయవిదారక సంఘటన కరీంనగర్ (Karimnagar) జిల్లా అలుగునూర్ (Alugunur) గ్రామంలో చోటుచేసుకుంది. ఈ విషయం కార్పొరేటర్ మల్లేశం స్పందన అనాధ వృద్ధుల ఆశ్రమం దృష్టికి తీసుకురావడంతో, వెంటనే స్పందించిన ఆశ్రమ నిర్వాహకులు మంచికట్ల శ్రీనివాస్ అక్కడికి వెళ్లి ఆ తల్లిని ఆశ్రమానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించడం జరిగింది.
కన్నవారు దూరమైనా… మానవత్వం ఇంకా బతికే ఉంది!
తల్లిదండ్రులను వృద్ధాప్యంలో భారంగా భావించకండి. మనల్ని నడిపించిన ఆ చేతులకు చివరి దశలో మనమే అండగా నిలబడాలి. కన్న బిడ్డలు ఆదరించకపోయినా, స్పందన అనాధ వృద్ధుల ఆశ్రమం (Spandana Old Age Home) ఆ తల్లికి ఒక నీడగా, ఒక కుటుంబంగా నిలుస్తుంది. ఇలా ఎంతోమంది అనాధలను అభాగ్యులకు అండగా నిలుస్తున్న స్పందన అనాధ వృద్ధుల ఆశ్రమాన్ని ప్రభుత్వం గుర్తించాలని మంచికట్ల శ్రీనివాస్ ఆశ్రమ నిర్వాహకులుపేర్కొన్నారు.

