అలుగునూర్‌‌లో కన్నీళ్లు తెప్పించే ఘటన

కలం, కరీంనగర్: ఒకప్పుడు తన కడుపులో పెట్టుకొని పెంచిన కొడుకు మరణించాడు.. ఇద్దరు బిడ్డలు ఉన్నప్పటికీ చివరి దశలో ఆ తల్లికి అండగా నిలబడాల్సిన వారు పట్టించుకోకపోవడంతో అనాధగా మిగిలిపోయింది.  ఈ హృదయవిదారక సంఘటన కరీంనగర్ (Karimnagar) జిల్లా అలుగునూర్ (Alugunur) గ్రామంలో చోటుచేసుకుంది. ఈ విషయం కార్పొరేటర్ మల్లేశం స్పందన అనాధ వృద్ధుల ఆశ్రమం దృష్టికి తీసుకురావడంతో, వెంటనే స్పందించిన ఆశ్రమ నిర్వాహకులు మంచికట్ల శ్రీనివాస్ అక్కడికి వెళ్లి ఆ తల్లిని ఆశ్రమానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించడం జరిగింది.

కన్నవారు దూరమైనా… మానవత్వం ఇంకా బతికే ఉంది!

తల్లిదండ్రులను వృద్ధాప్యంలో భారంగా భావించకండి. మనల్ని నడిపించిన ఆ చేతులకు చివరి దశలో మనమే అండగా నిలబడాలి. కన్న బిడ్డలు ఆదరించకపోయినా, స్పందన అనాధ వృద్ధుల ఆశ్రమం (Spandana Old Age Home) ఆ తల్లికి ఒక నీడగా, ఒక కుటుంబంగా నిలుస్తుంది. ఇలా ఎంతోమంది అనాధలను అభాగ్యులకు అండగా నిలుస్తున్న స్పందన అనాధ వృద్ధుల ఆశ్రమాన్ని ప్రభుత్వం గుర్తించాలని మంచికట్ల శ్రీనివాస్ ఆశ్రమ నిర్వాహకులుపేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>