గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, బాసర: రానున్న గోదావరి పుష్కరాలను (Godavari Pushkaralu)దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. బుధవారం బాసరలోని ఆలయ ఈవో కార్యాలయంలో పుష్కరాల ఏర్పాట్లు, సరస్వతీ అమ్మవారి ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పుష్కర ఘాట్ల మరమ్మతులు, నూతన ఘాట్ల నిర్మాణం, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, పిండ ప్రదాన ప్రాంతం, పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం, భక్తుల పార్కింగ్, వీఐపీ పార్కింగ్ తదితర పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, పుష్కరాలకు వచ్చే ప్రముఖుల వసతికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ప్రతి పనికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం సరస్వతీ అమ్మవారి ఆలయ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, పనుల్లో జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ సుభాష్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, ఆలయ ఈవో అంజనా దేవి, తహసీల్దార్ పవన్ చంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>