ఈవీఎం గోదాంలో కలెక్టర్ తనిఖీ.. భద్రతా ఏర్పాట్లపై పరిశీలన

కలం, హనుమకొండ: హనుమకొండ (Hanumakonda) సుబేదారిలోని రెడ్‌క్రాస్‌ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాం (EVM Warehouse)ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి గురువారం నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. గోదాంకు వేసిన సీల్స్‌, భద్రతా ఏర్పాట్లు, పరిసరాల నిర్వహణ, సీసీటీవీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు.

ఈవీఎంల భద్రత విషయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. గోదాం వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ జగత్‌సింగ్‌, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>