కలం, వెబ్‌డెస్క్: ఏపీ గ్రూప్-1 పరీక్షల స్కామ్ (AP Group 1 Exam Scam)పై ఈడీ కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించామని ఈడీ వెల్లడించింది. ప్రైవేటు సంస్థలకు రూ.1.14 కోట్లు చెల్లింపులు జరిగినట్లు తెలిపింది. ఈ కేసులో భాగంగా క్యామ్ సైన్ మీడియా సహా పలు సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి, మనీలాండరింగ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఆధారాలను సేకరించింది.
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ కార్యదర్శి సీతారామాంజనేయులు నివాసంలోనూ తనిఖీలు చేపట్టి డిజిటల్ పత్రాలు, ఇతర ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. గ్రూప్-1 పరీక్షల అక్రమాల వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ కోణాలపై దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ ప్రకటించింది. గ్రూప్-1లో అవకతవకలు (AP Group 1 Exam Scam) జరిగాయన్న నేపథ్యంలో హైదరాబాద్, గుంటూరు, సికింద్రాబాద్ సహా మొత్తం ఏడు చోట్ల ఈ నెల 4న ఈడీ సోదాలు జరిపింది.
Also Read : ఏపీలో ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికల పోలింగ్
Follow Us On : WhatsApp

