రూట్ ఆటతీరుపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

కలం, స్పోర్ట్స్ : రెడ్డిట్ వేదికగా నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన టెస్టు పరుగుల రికార్డుకు చేరువవుతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌పై (Joe Root) ప్రశంసలు కురిపించారు. 2012లో నాగ్‌పూర్ టెస్టులో రూట్ అరంగేట్రం చేసినప్పుడే అతడు గొప్పగా రాణిస్తాడని తనకు అర్థమైందని సచిన్ తెలిపారు. విదేశీ బ్యాటర్లలో జో రూట్‌తో పాటు హ్యారీ బ్రూక్, స్టీవ్ స్మిత్ తనకు ఇష్టమైన ఆటగాళ్లని పేర్కొన్నారు.

ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా ఉన్న జో రూట్.. 169 మ్యాచ్‌ల్లో 14,278 పరుగులు సాధించారు. సచిన్ పేరిట ఉన్న 15,921 పరుగుల రికార్డును అధిగమించేందుకు రూట్‌కు మరో 1,643 పరుగులు మాత్రమే అవసరం. ఈ సందర్భంగా వన్డే ఫార్మాట్‌లో మార్పులపై కూడా సచిన్ తన పాత సూచనను పునరుద్ఘాటించారు. 50 ఓవర్ల మ్యాచ్‌ను తలా 25 ఓవర్ల చొప్పున రెండు ఇన్నింగ్స్‌లుగా విభజించాలని సూచించారు. 10 వికెట్లు అలాగే ఉంచి, ఒకే బంతిని ఉపయోగించాలని అభిప్రాయపడ్డారు. దీనివల్ల రెండు జట్లకు మంచు ప్రభావం సమానంగా ఉంటుందని, ఆటలో సమతుల్యత ఏర్పడుతుందని సచిన్ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>