చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు.. టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు

కలం, వనపర్తి : పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామ శివారులోని చెరువులో (Maddigatla Lake) మట్టి అక్రమ (Illegal Soil) తరలింపు వ్యవహారం కలకలం రేపింది. రాత్రివేళ ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులో మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా మెట్టుపల్లికి తరలిస్తున్నట్లు గుర్తించిన గ్రామస్తులు అడ్డుకున్నారు. మట్టి రవాణా చేస్తున్న టిప్పర్లను నిలిపివేసి గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. అనంతరం వాహనాలను అధికారులకు అప్పగించారు.

ఈ మట్టి తరలింపు వ్యవహారంలో వనపర్తికి చెందిన ఓ వార్డు కౌన్సిలర్ ప్రమేయం ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువులో మట్టిని తరలించేందుకు అనుమతులు ఎవరు ఇచ్చారు? రాత్రివేళ రవాణా వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వ చెరువుల నుంచి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>