కలం, వెబ్ డెస్క్ : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) శ్రీనివాస్ పౌరాణిక కథతో ఓ పెద్ద సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ (JR NTR) హీరోగా దీన్ని ఓకే చేశారు కూడా. కానీ ఎప్పటికప్పుడు దీనిపై రకరకాల రూమర్లు క్రియేట్ అవుతూనే ఉన్నాయి. అందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను మాత్రం ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది. గత వారం రోజులుగా ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేతుల్లో నుంచి వెళ్లిపోయిందనే రూమర్లు వస్తున్నాయి. తిరిగి అల్లు అర్జున్ తోనే ఈ ప్రాజెక్ట్ చేయడానికి త్రివిక్రమ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఒకటే పోస్టులు వస్తున్నాయి. ఈ కథకు ఎన్టీఆర్ కంటే అల్లు అర్జున్ అయితేనే పర్ ఫెక్ట్ అని కొందరు చెప్పడంతో త్రివిక్రమ్ డైలమాలో పడ్డారనే వార్తలు వస్తున్నాయి.
మొన్న బన్నీ వాసు మాట్లాడుతూ అల్లు అర్జున్ అట్లీ సినిమాతో పాటు మరో రెండు ఓకే చేశారని.. 2026లో ఒకటి.. 2027లో ఒకటి స్టార్ట్ అవుతాయని తెలిపాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేశ్ హీరోగా ఓ సినిమా స్టార్ట్ చేశాడు. అది వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని అంటున్నారు. అల్లు అర్జున్ ప్రజెంట్ అట్లీ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాను ఇప్పుడిప్పుడే పట్టాలెక్కిస్తున్నాడు. కాబట్టి ఇప్పటికప్పుడు అల్లు అర్జున్ తో అంత పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేడని అంటున్నారు ట్రేడ్ పండితులు. కాబట్టి అల్లు అర్జున్ తో సినిమా ఓకే చేసుకున్నది వేరే డైరెక్టర్లు కావచ్చని అంటున్నారు. పైగా ఎన్టీఆర్ కు మాట ఇచ్చి తప్పితే పరిస్థితులు వేరుగా ఉంటయన్నది త్రివిక్రమ్ కు బాగా తెలుసు.
అందులోనూ యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ యముడి పాత్రకు బాగా సూట్ అయ్యాడు. కాబట్టి పౌరాణిక పాత్రకు ఎన్టీఆర్ బెస్ట్ అని త్రివిక్రమ ఇప్పటికీ భావిస్తున్నాడంట. ప్రశాంత్ నీల్ మూవీ అయిపోయేలోపు వెంకటేశ్ తో త్రివిక్రమ్ మూవీ కూడా కంప్లీట్ అవుతుంది. అప్పుడు వీరి కొత్త ప్రాజెక్ట్ మొదలయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు సినిమా మేథావులు.

Read Also: అనిల్ రావిపూడి.. నెక్ట్స్ టార్గెట్ ఇదే
Follow Us On: Instagram


