కలం, వెబ్‌డెస్క్: జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ (Friedrich Merz) వచ్చే వారం భారత పర్యటనకు రానున్నారు. రెండు రోజులపాటు దేశంలో పర్యటించనున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 12న ఫ్రెడరిక్ ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో దిగనున్నారు. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ఇద్దరూ సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపరిచే ప్రయత్నాల్లో భాగంగా అనేక కీలకాంశాలు చర్చిస్తారు.
ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఛాన్సలర్ హోదాలో ఫ్రెడరిక్ మెర్జ్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఆయన బెంగళూరునూ సందర్శిస్తారు. అమెరికా టారిఫ్‌లు, హెచ్1బీ సమస్యలు ఇబ్బంది పెడుతున్న వేళ జర్మనీ ఛాన్సలర్ భారత పర్యటనకు రావడం వ్యాపార, ఉద్యోగ, విద్యా రంగాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

Read Also: సిక్సర్లతో చెలరేగిన సూర్యవంశీ.. సిరీస్ యువ భారత్‌దే
Follow Us On: Pinterest


