కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమీషన్లు ముట్టనిదే ఏ ఫైల్‌పైనా సంతకాలు చేయడం లేదన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్‌కు కమీషన్ల ప్రభుత్వాన్ని నడుపుతోందని ప్రజలంతా చర్చించుకుంటున్నారని, వీటిని కాంగ్రెస్ కూడా ఖండించడం లేదని చెప్పారు. అవి వాస్తవాలు కాబట్టే కాంగ్రెస్ వాటిని ఖండించడం లేదని, ఆధారాలు కూడా ఉన్నాయని, అతి త్వరలోనే వాటిని బయటపెడతానని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే గతంలో ఒకసారి మంత్రి కొండా సురేఖ(Konda Surekha).. మంత్రులు కమీషన్లు అందనిదే ఫైల్స్‌ను ముందుకు పంపడం లేదని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కాగా తాను మాజీ మంత్రులు గురించి అన్నానని, తన మాటలను వక్రీకరించారని ఆమె తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay).. కాంగ్రెస్‌పై కమీషన్ల ఆరోపణలు చేశారు. ఆయన ఆధారాలు ఉన్నాయని చెప్పడంతో ఈ అంశం తీవ్ర చర్చలకు దారితీస్తోంది.
Read Also: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లు.. ఈరోజూ అవకాశం..

