కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ లో హింసాత్మక నిరసనలు కొనసాగుతున్న భారత ప్రభుత్వం తమ పౌరులకు కీలక సూచనలు చేసింది. ఇరాన్ కు అనవసరంగా వెళ్లే వారు తమ ప్రయాణాలను (Iran Travel) రద్దు చేసుకోవాలని సోమవారం భారత విదేశాంగ శాఖ (Ministry of External Affairs India) ప్రకటన జారీ చేసింది. తదుపరి నోటీసులు వచ్చేవరకు సూచనలు పాటించాలని కోరింది. ప్రస్తుతం ఇరాన్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా భారతీయ పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
నిరసనలు, ప్రదర్శనలు కొనసాగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని, భారత రాయబార కార్యాలయం వార్తలను, అలాగే వెబ్ సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ను నిశితంగా పరిశీలించాలని సలహా ఇచ్చిన భారత విదేశాంగ శాఖ. నివాస వీసాలపై ఇరాన్ లో నివసిస్తున్న భారత పౌరులు భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోకపోతే, నమోదు చేసుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది.
ఇరాన్ లో తీవ్రమవుతున్న ఆర్తిక సంక్షోభం, కరెన్సీ విలువ తీవ్రంగా పడిపోవడం కారణాలతో ఆ దేశ ప్రజలు నిరసనలు చేపడుతున్నా. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. వారం రోజుల్లోనే 20 మంది చనిపోగా.. 990 మంది అరెస్ట్ చేశారు. భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్నాయి.

Read Also: వచ్చే వారం భారత్కు జర్మనీ ఛాన్సలర్
Follow Us On: Youtube


