epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఫిబ్రవరిలో శిఖర్​ ధావన్​ పెళ్లి .. వధువు ఎవరంటే?

కలం, వెబ్​డెస్క్​: టీమిండియా మాజీ క్రికెటర్​ శిఖర్​ ధావన్​ (Shikhar Dhawan) త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. కొంతకాలంగా తన పెళ్లిపై వస్తున్న రూమర్స్​కు చెక్​ పెడుతూ త్వరలోనే ఒక ఇంటివాడు కానున్నాడు. ఈ మేరకు అతని సన్నిహితులు వెల్లడించారు. కాగా, గబ్బర్​ మొదటి భార్య ఆయేషా ముఖర్జీతో రెండేళ్ల కిందట విడిపోయిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాను మొదట గబ్బర్​ వివాహం చేసుకున్నాడు. అప్పటికే భర్తతో విడిపోయిన ఆయేషాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉండగా, వారిని తన కూతుళ్లుగా స్వీకరించాడు. తర్వాత శిఖర్​, ఆయేషా దంపతులకు ఒక కుమారుడు జొరావర్​ పుట్టాడు. కొన్నేళ్లకు కాపురంలో కలతలు రావడంతో శిఖర్​, ఆయేషా జంట 2023లో విడాకులు తీసుకుంది. కూతుళ్లతోపాటు కుమారుడిని తీసుకొని ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. కుమారుడితో మాట్లాడేందుకు కూడా ఆయేషా ఒప్పుకోవడం లేదని, జొరావర్​ను తనకు దూరం చేస్తోందని అనేకసార్లు సోషల్​ మీడియా వేదికగా గబ్బర్​ వాపోయాడు.

మిస్టరీ గర్ల్​తో చెట్టాపట్టాలు..

ఈ క్రమంలో 2024 ముంబై ఎయిర్​పోర్ట్​లో ఒకమ్మాయితో శిఖర్​ ధావన్ (Shikhar Dhawan) కనిపించాడు. ఆ అమ్మాయి గబ్బర్​ గర్ల్​ఫ్రెండ్​ అని రూమర్స్​ వచ్చాయి. అయితే, ఆ మిస్టరీ గర్ల్​ వివరాలు తెలియరాలేదు. ఆ తర్వాత నిరుడు చాంఫియన్స్​ ట్రోఫీలో భారత్​ పాల్గొన్న మ్యాచ్​కు హాజరైన శిఖర్​ ధావన్​ పక్కన ఆ మిస్టరీ గర్ల్​ మరోసారి కనిపించింది. ఈసారి సోషల్​ మీడియా ద్వారా ఆమె​ వివరాలు బయటికొచ్చాయి. ఐర్లాండ్​కు చెందిన ఆ మిస్టరీ గర్ల్​ పేరు సోఫీ షైన్ ​(Sophie Shine). ​ప్రోడక్ట్​ కన్సల్టెంట్​గా పనిచేసే సోఫీని మొదటిసారి దుబాయ్​లో శిఖర్​ కలుసుకున్నాడు. అనంతరం వారి పరిచయం ప్రేమగా మారింది. ఇప్పుడు ఫిబ్రవరిలో సోఫీని శిఖర్​ ధావన్​ పెళ్లాడనున్నాడు. పెళ్లి వేదిక ఇంకా ఖరారు కానప్పటికీ ఢిల్లీ–ఎన్​సీఆర్​ పరిధిలోనే ఉండొచ్చని సన్నిహితులు వెల్లడించారు. క్రికెటర్లు, బాలీవుడ్​ ప్రముఖుల సమక్షంలో అత్యంత వేడుకగా ఈ పెళ్లిని జరుపుకోవాలని శిఖర్​ ధావన్​ ప్లాన్​ చేస్తున్నట్లు చెప్పారు.

కాగా, టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలోనూ కలపి 269 అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడిన గబ్బర్​.. 10,867 పరుగులు చేశాడు. ఇందులో 24 సెంచరీలు, 44 హాఫ్​ సెంచరీలు ఉన్నాయి. రోహిత్​తో కలసి ఓపెనర్​గా ఎన్నో మ్యాచ్​ల్లో భారత్​కు విజయాలు అందించాడు. శుభ్​మన్​ గిల్​ రాకతో గబ్బర్​ కెరీర్​ నెమ్మదించింది. దీంతో 2024 ఆగస్ట్​లో క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు.

Read Also: సిక్సర్లతో చెలరేగిన సూర్యవంశీ.. సిరీస్​ యువ భారత్​దే

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>