కలం, వెబ్‌డెస్క్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) ఇంటిపై దాడి జరిగింది. ఓహాయో రాష్ట్రంలోని సిన్సినాటి నగరంలో ఉన్న వాన్స్ ఇంటిపై ఓ అపరిచితుడు దాడికి దిగాడు. తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో చాలా కిటీకీల అద్దాలు పగిలాయి. దీనిపై అమెరికా సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సోమవారం తెల్లవారుజామున దాడి సమాచారం తెలియగానే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ‘ఈస్ట్ వాల్నట్ హిల్స్ రెసిడెన్సీ’కి చేరుకున్నారు. నిందితుడు పారిపోకుండా ఇంటిని చుట్టుముట్టారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే, దుండగుడిపై కేసు పెట్టిందీ లేనిదీ తెలియలేదు. అయితే, దుండగుడు ఇంట్లోకి చొరబడ్డాడన్న వార్తలను పోలీసులు తోసిపుచ్చారు. కాగా, దాడి సమయంలో జేడీ వాన్స్, సతీమణి ఉషా వాన్స్‌తో సహా కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేరు. న్యూ ఇయర్ సందర్భంగా జేడీ వాన్స్ ఇంటి సమీపంలో సెక్యూరిటీ తగ్గడంతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అంటున్నారు. మరోవైపు ట్రంప్, ముఖ్య అధికారులు వెనెజువెలాపై దాడిని ట్రంప్ నివాసం మార్ ఎ లాగో నుంచి వీక్షించగా.. సైన్యం ఆపరేషన్‌ను వాన్స్ పర్యవేక్షించినట్లు తెలుస్తోంది.

Read Also: మదురో అరెస్ట్‌పై బెట్టింగ్.. రూ.4కోట్లు లాభం!
Follow Us On: Instagram


