epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మదురో అరెస్ట్​పై బెట్టింగ్​.. రూ.4కోట్లు లాభం!

కలం, వెబ్​డెస్క్​: వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్​ మదురో (Nicolas Maduro) అరెస్ట్​ అవుతారని ఆన్​లైన్​లో బెట్టింగ్​ వేసి రూ.కోట్లు సంపాదించాడో వ్యక్తి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ నెల 3న వెనెజువెలా రాజధాని కరాకస్​లో మదురోను, అతని భార్యను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన గురించి అమెరికా అధ్యక్షుడికి, మరికొందరు అత్యున్నత అధికారులకు, సైనిక చర్యలో పాల్గొన్నవాళ్లకు మాత్రమే ముందుగా తెలిసే అవకాశం ఉంది. మిగిలినవాళ్లకు తెలిసే అవకాశమే లేదు. అయితే, విచిత్రంగా మదురో అరెస్ట్​ కావడానికి కొన్ని గంటల ముందు.. బ్లాక్​చెయిన్​ ఆధారంగా నడిచే పాలీమార్కెట్​లో కొత్తగా ఒక ట్రేడింగ్​ అకౌంట్​ పుట్టుకొచ్చింది.

మదురో పదవి నుంచి దిగిపోతాడని, అరెస్ట్​​ అవుతారంటూ ఆ అకౌంట్​ నుంచి 30వేల డాలర్లు (సుమారు 27లక్షలు) బెట్టింగ్​ వేశారు. ఆ తర్వాత 24 గంటల్లోనే ఆ అకౌంట్​కు సుమారు 4లక్షల డాలర్లకు పైగా(దాదాపు 4కోట్లు) లాభం వచ్చింది! దీంతో మదురో అరెస్ట్​ విషయంలో ఇన్​సైడర్​ ట్రేడింగ్​ జరిగిందని వ్యాపార వర్గాలు అనుమానిస్తున్నాయి. బెట్​ వేసిన అకౌంట్​ పెంటగాన్​కు చెందిన, లేదా పెంటగాన్​తో సంబంధం ఉన్న వ్యక్తిదని ట్రేడర్లు భావిస్తున్నారు.

మదురో (Nicolas Maduro) అరెస్ట్​ మీద బెట్టింగ్​పై ‘వాల్ స్ట్రీట్ జర్నల్‌’తో ఓ ట్రేడర్ మాట్లాడారు. పెంటగాన్​ సమీపంలోని డొమినోస్​ పిజ్జా అవుట్​లెట్లలో అర్ధరాత్రి ఆర్డర్లు ఒక్కసారిగా పెరగడం గమనించి, తాను బెట్టింగ్​ వేసి లాభపడినట్లు చెప్పారు. కాగా, ఏదైనా కంపెనీకి లేదా ప్రభుత్వ పాలసీకి సంబంధించిన రహస్య విషయం ముందుగానే తెలుసుకొని కంపెనీ షేర్లు కొనడం లేదా అమ్మడం ద్వారా లాభపడడాన్ని ఇన్​సైడర్​ ట్రేడింగ్​ అంటారు. ప్రిడిక్షన్​ మార్కెట్​లో ఇన్​సైడర్ల పాత్ర కొత్తేమీ కాకపోయినా మదురో అరెస్ట్​ మీద వచ్చిన బెట్​, అనంతరం లాభం చూసి ట్రేడర్లు ఆశ్చర్యపోతున్నారు. ‘కేవలం అంచనాలతో 30వేల డాలర్లను అర మిలియన్​ డాలర్లుగా మార్చేశాడు. ట్రంప్​ ఆఫీస్​కు చెందిన వ్యక్తే పాలీమార్కెట్​ను ఉపయోగించి, ఈ డబ్బు సంపాదించాడని అర్థం అవుతోంది’ అని ‘ఎక్స్​’లో ఓ ట్రేడర్​ ట్వీట్​ చేయడం దీనికి బలం చేకూరుస్తోంది.

Read Also: జేడీ వాన్స్​ నివాసంపై దాడి.. ఒకరి అరెస్ట్​

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>