కలం, వెబ్ డెస్క్: ఏపీలోని అంబేద్కర్ కోనసీమ (Konaseema) జిల్లాలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో భారీగా గ్యాస్ లీకేజీ అయ్యింది. ఈఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం గ్యాస్ పైప్ లీకైంది. భారీగా గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మంటలు అదుపు చేసేందుకు వెళ్లిన ఓఎన్జీసీ సిబ్బంది సైతం పరుగులు తీశారు. గ్యాస్ లీక్ ఎలా జరిగిందనే దానిపై అధికారుల ఆరాతీస్తున్నారు. ఘటనా స్థలం నుంచి స్థానికులను వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు.
ఏపీలో తరుచుగా గ్యాస్ (Gas) లీక్ ఘటనలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వాధికారులు, నాయకుల్లో మార్పు రావడం లేదు. ఏదైనా ఘటనలు జరిగినప్పుడే హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆ తర్వాత జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. 2014 జూన్ 27న తూర్పు గోదావరి జిల్లాలో భారీ పేలుడుకు 15 మంది సజీవ దహనం అయ్యారు. ఆ ఘటన ఏపీని ఉలిక్కిపడేలా చేసింది.

Read Also: రెండు రాష్ట్రాల మధ్య విద్వేషం వద్దు.. ఐకమత్యం కావాలి : చంద్రబాబు
Follow Us On : WhatsApp


