కలం, వెబ్‌డెస్క్: సముద్రంలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కాలుష్య నియంత్రణ నౌక ‘సముద్ర ప్రతాప్’ (Samudra Pratap) ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. సోమవారం గోవాలోని పనాజీ పోర్ట్‌లో ఈ నౌకను ఆయన జాతికి అంకితం చేశారు. 114.5 మీటర్ల పొడవున్న ఈ నౌకను గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (జీఎస్ఎల్) తయారుచేసింది. దీని నిర్మాణంలో 60శాతం స్వదేశీ పరికరాలు వాడారు. 4,200 టన్నుల బరువున్న ఈ నౌక గరిష్ఠంగా 22 నాట్ల స్పీడ్‌తో ప్రయాణించగలదు. 6వేల నాటికల్ మైళ్ల వరకు సంచరించగలదు. అంతర్జాతీయ సముద్ర చట్టాల పరిరక్షణ, సముద్ర కాలుష్య నియంత్రణ నిబంధనల అమలు, శోధన–రక్షణ చర్యలతో పాటు భారత ప్రత్యేక ఆర్థిక మండలి(ఈఈజెడ్) రక్షణ బాధ్యతల్లో భాగమవుతుంది.

Read Also: సీనియర్ సిటిజెన్స్‌కు బెస్ట్ ఎఫ్‌డీలు ఇవే!
Follow Us On: Youtube


