కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) గత ఏడాది “వార్ 2” (WAR 2 )సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా ఎన్టీఆర్ యాక్టింగ్ కు మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ “సలార్” (Salaar) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తుండటంతో ఆ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి చిన్న న్యూస్ లీక్ అయినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన క్యూట్ బ్యూటీ రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన ఒక భారీ సెట్ లో మొదలయ్యింది. ఈ షెడ్యూల్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తి అయిన తరువాత జరిగే ఫారెన్ షెడ్యూల్ తో మూవీ టాకీ పార్ట్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందని సమాచారం. అయితే ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా మేకర్స్ కూడా అదే టైటిల్ ని ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తుంది.

Read Also: పారిస్ లో ‘వారణాసి’ .. బిగ్ అప్డేట్
Follow Us On: X(Twitter)


