కలం, నల్లగొండ బ్యూరో : కేసీఆర్ చనిపోవాలని హరీశ్ రావు, కేటీఆర్ కోరుకుంటున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీని తన ఆధీనంలోకి తీసుకోవడానికి హరీశ్ రావు తహతహలాడుతున్నారని చామల ఆరోపించారు. తనకు అడ్డు వస్తోందని కేసీఆర్ కుమార్తె కవితను హరీశ్ రావు బయటకు పంపించారని విమర్శించారు.
ఈ విషయంపై కవిత (Kavitha) స్వయంగా మాట్లాడుతున్నారని చెప్పారు. తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆవేదనతో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడారు తప్ప.. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలన్నదే ఆయన ఆకాంక్ష అని చామల చెప్పుకొచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి పదేళ్లలో తెలంగాణ పాలన గురించి చెప్పాలన్నారు. పొద్దున లేస్తే అబద్దాలు చెబుతూ కేటీఆర్, హరీశ్ రావు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపీ చామల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి పట్ల వ్యతిరేకత నింపాలని ప్రయత్నం : చామల
సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ చావు కోరుకుంటున్నారని, ఉరితీయాలి అంటున్నారని ప్రజల్లో రేవంత్ రెడ్డి పట్ల విషం నింపి వ్యతిరేకత తీసుకురావాలని కేటీఆర్, హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారన్నారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యం బాగుండాలని రేవంత్ రెడ్డి కలిసి వచ్చారని గుర్తు చేశారు. గత పది సంవత్సరాల్లో కేసీఆర్ రావణుడి లాగా పాలించారని, అందువల్లే రామరాజ్యం కావాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు సీఎంగా చేశారన్నారు. కేసీఆర్ దౌర్భాగ్య పాలన చేయకుండా మంచి పాలన చేసి ఉంటే రేవంత్ రెడ్డికి సీఎంగా అవకాశం వచ్చేది కాదని, మళ్ళీ కేసీఆర్ సీఎంగా అయ్యి ఉండేవారని పేర్కొన్నారు. కేసీఆర్ బతికి ఉంటేనే గత పది సంవత్సరాలు కాలంలో పాలన ఏ విధంగా సాగిందో తెలుస్తుందని, అందరూ కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నారని చామల చెప్పారు.
అబద్ధాలు వారి జన్మ హక్కు..
పొద్దున్నే లేస్తే అబద్దాలు చెప్పడం వారి జన్మహక్కు లాగా తెలంగాణ ప్రజలను హరీష్ రావు, కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపీ చామల ఆగ్రహం వక్యతం చేశారు. పాలమూరు రంగారెడ్డి, కృష్ణా జలాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, తుమిడిహట్టి ప్రాజెక్టు మీద తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. ఇప్పుడు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అదే పని చేస్తున్నారని ఎంపీ చామల తెలిపారు.

Read Also: రాజకీయ లబ్దికే మళ్లీ నీళ్ల కుంపటి.. బీఆర్ఎస్ పై జగ్గారెడ్డి ఫైర్
Follow Us On: Youtube


