కలం, సినిమా : రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన సినిమా షూటింగ్ ఉందంటే చాలు తన ఇంటి నుండే రకరకాల ఫుడ్ ఐటమ్స్ షూటింగ్ స్పాట్ కి తెప్పిస్తాడు. ఒకరకంగా ప్రభాస్ ఫుడ్ పెట్టి చంపేస్తాడు అని సెలబ్రిటీలు సరదాగా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ప్రభాస్ తో నటించిన హీరోయిన్స్ అంతా ఆయన పంపిన ఫుడ్ గురించి చెప్పిన వాళ్ళే కానీ ప్రభాస్ కి ఫుడ్ వండిపెట్టిన విషయం ఎవరూ చెప్పలేదు. మొదటిసారి ఓ హీరోయిన్ మాత్రం ప్రభాస్ కి తాను వండి పెట్టినట్లు చెప్పుకొచ్చింది.
ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “ది రాజాసాబ్ ” (The RajaSaab) జనవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దీనితో సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించిన రిద్ధి కుమార్(Riddhi Kumar) వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. అయితే హీరోయిన్ రిద్ధి కుమార్ రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ప్రభాస్ నాకు మూడేళ్ళ క్రితం చీర గిఫ్ట్ ఇచ్చాడని ఆ చీరని ఇవాళ కట్టుకొచ్చానని తెలిపింది. దీంతో ప్రభాస్ హీరోయిన్ కి చీర గిఫ్ట్ ఇచ్చాడా అని అంతా షాక్ అయ్యారు. అయితే తాజా ఇంటర్వ్యూలో రిద్ధి కుమార్ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిపింది. ప్రభాస్ అందరికి చాలా సార్లు ఇంటి నుంచి ఫుడ్ తెప్పించారు. అందుకే నాకు కూడా ప్రభాస్ కి ఫుడ్ ఇవ్వాలనిపించి ఇంటి వద్ద బటర్ చికెన్ వండుకొని ప్రభాస్ కి పెట్టానని.. అది తిన్న ప్రభాస్ చాలా బాగుంది అని చెప్పినట్లు రిద్ది తెలిపింది.


