కలం, వెబ్ డెస్క్ : చిరంజీవి హీరోగా వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. తిరుపతిలో చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాట్లాడారు. ‘ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. థియేటర్లలో రెండున్నర గంటలకు పైగా సినిమా ఉంటుంది. అది చూసి కచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా బయటకు వస్తారు. ఒక అభిమానిగా చిరంజీవిని ఎలా చూడాలి అనుకుంటామో.. అలాంటి పాయింట్లతోనే కథ రాసుకున్నా. నేను అనుకున్న దాని కంటే చిరంజీవి స్వాగ్ తో కామెడీని డబుల్ చేశారు. మీరందరూ థియేటర్లలో చిరంజీవి కామెడీని చూస్తారు. సినిమా వేరే లెవల్లో ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి .
చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం వస్తుందని అనుకోలేదు.. ఆ తిరుపతి వెంకటేశ్వరుడి దయతో అది నిజమైందని అందుకే తిరుపతిలో ఈవెంట్ పెట్టుకున్నట్టు వివరించారు అనిల్ రావిపూడి. వెంకటేశ్ పాత్ర కూడా ఆకట్టుకుంటుందని.. ఇద్దరు హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూస్తే ఇద్దరి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని తెలిపాడు అనిల్ రావిపూడి. జనవరి 12న రిలీజ్ కాబోతోంది ఈ మూవీ. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

Read Also: మన శంకర వర ప్రసాద్ గారు ట్రైలర్ వచ్చేసింది
Follow Us On: X(Twitter)


