epaper
Friday, January 16, 2026
spot_img
epaper

రాజకీయ లబ్దికే మళ్లీ నీళ్ల కుంపటి.. బీఆర్​ఎస్ పై జగ్గారెడ్డి ఫైర్​

కలం, వెబ్​ డెస్క్​ : రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల మధ్య బీఆర్​ఎస్ మళ్లీ నీళ్ల కుంపటి పెడుతున్నదని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి (Jagga Reddy) అన్నారు. ఆదివారం గాంధీభవన్ లో​ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా హరీశ్​ రావు ఇవాళ ఉదయం తెలంగాణ నదీ అంశంపై బీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసులో ఇచ్చిన పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ని జగ్గారెడ్డి తప్పుబట్టారు.

బీఆర్ఎస్​ పార్టీ ఆఫీసులో పీపీటీ పెట్టారు.. అదే విషయంపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని హరీశ్​​ రావును (Harish Rao) జగ్గారెడ్డి నిలదీశారు. కాళేశ్వరం కట్టాకే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నట్టు బీఆర్ఎస్​ ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ హయాంలోనే నాగార్జునసాగర్​, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయని జగ్గారెడ్డి గుర్తు చేశారు.

అలాగే.. సింగూరు, మంజీరా డ్యామ్​ లు కాంగ్రెస్​ హయాలంలోనే నిర్మించారన్నారు. వీటి ద్వారానే హైదరాబాద్ ప్రజలకు తాగునీరు సరఫరా అయిందని తెలిపారు. జగన్​, కేసీఆర్​ మాట్లాడుకున్నప్పుడు బీఆర్ఎస్​ వాళ్లకు జల దోపిడి గుర్తుకు రాలేదా.. ఇప్పుడు రేవంత్​ రెడ్డి, చంద్రబాబు కలిసి మాట్లాడుకుంటే తప్పా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Jagga Reddy
Jagga Reddy

Read Also: తిండి, నీళ్లు లేవు.. వెనిజువెలాలో భయంకర పరిస్థితులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>