కలం, వెబ్‌డెస్క్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌధా అధినేత, ‘డేరా బాబా’ (Dera Baba) గా పేరొందిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరోసారి పెరోల్ లభించింది. ఈ మేరకు రోహ్తక్ డివిజనల్ కమిషనర్ 40 రోజుల పెరోల్ మంజూరు చేశారు. హర్యానాలోని శిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌధా ప్రధాన ఆశ్రమంలో ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో డేరా బాబాకు 2017లో 20 ఏళ్ల శిక్ష పడింది. అలాగే 16 ఏళ్ల కిందట ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులోనూ మరో ముగ్గురితో కలసి దోషిగా తేలారు. ప్రస్తుతం రోహత్క్లోని సనారియాలో డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నారు.
కాగా, పెరోల్ లేదా ఫర్లో ( కొన్ని కేసుల్లో దీర్ఘకాల శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ప్రత్యేక సందర్భాల్లో శిక్ష నుంచి కొన్ని రోజులు సెలవు(ఫర్లో) తీసుకునే వెసులుబాటును హర్యా జైళ్ల శాఖ ఇస్తుంది)పై డేరా బాబా ఎనిమిదేళ్లలో 15వ సారి జైలు నుంచి బయటకు రావడం గమనార్హం. చివరిగా గతేడాది అక్టోబర్‌లో 20 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చారు. కాగా, పెరోల్ లేదా ఫర్లోపై బయటకు వచ్చిన 13 సందర్భాల్లో ఆయన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్‌లో ఉన్న డేరా ఆశ్రమంలో గడిపారు. డేరా బాబాకు ఇలా బయటకు రావడాన్ని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్జీపీసీ) పలుమార్లు వ్యతిరేకించింది. హర్యానా ప్రభుత్వంపై విమర్శలు చేసింది.
Read Also: అసోం స్క్రీనింగ్ కమిటీలో ప్రియాంక
Follow Us On: Pinterest


