రైతులకు శుభవార్త: పెద్దపల్లికి ఎస్సారెస్పీ నీరు.. ఎమ్మెల్యే భరోసా!

కలం, కరీంనగర్ బ్యూరో : ప్రస్తుత వానకాలం పంటలకు గానూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని (SRSP Water) శనివారం నిజామబాద్ జిల్లా పోచంపాడు వద్ద విడుదల చేయడం జరిగింది. దీంతో రేవెల్లి డిస్ట్రిబ్యూటరీ నుండి డి- 86, డి- 83 మెయిన్ కెనాల్ ల ద్వారా పెద్దపల్లి నియోజకవర్గంలోని పంటలకు సోమవారం వరకు శ్రీరామ్ సాగర్ నీరు అందుతుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు.

ఎల్ నినో ప్రభావంతో సాగునీరు సమస్య ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో పంటలను ఎలాగైనా కాపాడాలనే దృఢ నిశ్చయంతో ప్రాజెక్టు ద్వారా నీటి విడుదలకు కృషి చేయడం జరిగిందని చెప్పారు. పంటలు చేతికి వచ్చేవరకు తమ ప్రయత్నాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే కోరారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పొదుపుగా సాగునీటిని వాడుకోవాలని కోరారు. నీటి విడుదలకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు విజయ రమణారావు కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>