కలం, ఆదిలాబాద్ : పోలీసు సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ నిజాయితీతో బాధ్యతలు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (SP Akhil Mahajan) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన పరేడ్‌లో ఎస్పీ పాల్గొని సిబ్బంది యూనిఫామ్‌ను పరిశీలించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో సమర్థంగా విధులు నిర్వహించిన పోలీసు సిబ్బందిని అభినందించారు.
రానున్న నవరాత్రి ఉత్సవాల్లోనూ అదే స్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు శారీరక దృఢత్వానికి ప్రతిరోజూ వ్యాయామం చేయాలని సూచించారు. ప్రతి శనివారం పరేడ్ లేదా యోగా నిర్వహిస్తూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలన్నారు. 50 ఏళ్లు పైబడిన సిబ్బందికి ప్రత్యేకంగా యోగా నిర్వహించాలని తెలిపారు.

